భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేటలోని ఆవాస విద్యాలయంలో వివేకానంద విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం వన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. ఫారెస్ట్ అధికారులు విద్యాసాగర్, గీత శ్రీనివాస్ నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామాయంపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్, సబ్‌ఇన్‌స్పెక్టర్…