భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలను అడ్డగోలుగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనగా, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో “చలో బస్ భవన్” కార్యక్రమం ఉద్ధృతంగా జరిగింది. ఈ నిరసనలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, యువ నేత మాదిరి ప్రృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై స్పందిస్తూ, మెహిదీపట్నం నుంచి బస్ భవన్ వరకు వారు సామాన్య ప్రజలతో కలిసి బస్సులో ప్రయాణించి, పెరిగిన ఛార్జీల వల్ల ఎదురవుతున్న కష్టాలను ప్రయాణికుల నుంచి…





