భారత్ సమాచార్, యాదాద్రి జిల్లా: సర్పంచ్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామం నుండి బీఆర్ఎస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సైనికుల్లుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు షాక్.. ప్రభుత్వ విప్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




