భారత్ సమాచార్, జాతీయం ;
ఒక వైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు అంతకు మించి హీట్ ను పుట్టిస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం. వీటితో విసిగిపోయిన ప్రజలకు భారత వాతావారణ శాఖ ఒక చల్లని కబురును మోసుకొచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ తుపానుకు ‘రేమాల్’గా నామకరణం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మధ్య…




