భారత్ సమాచార్, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ –వికారాబాద్, సికింద్రాబాద్ – కాకినాడ, తిరుపతి – వికారాబాద్, నర్సాపూర్ – వికారాబాద్, లింగంపల్లి – నర్సాపూర్, లింగంపల్లి – కాకినాడ, వికారాబాద్ – కాకినాడ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ రైళ్లకు బుకింగ్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.





