భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, మున్సిపల్ ఎన్నికల మూడవ రోజు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా రామాయంపేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందులో 21 సమస్యాత్మక ప్రాంగణాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4 ఎస్ఎస్‌టీలు, 4…