భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలంలోని ఉట్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించిన ఆయన, ఉపాధ్యాయుల హాజరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రగతిపై హర్షం వ్యక్తం చేసారు. పాఠశాలలో ఉన్న పరిశుభ్రతను ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంబెల్లి శంకర్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ పర్యటనతో పాఠశాలలో నాణ్యతపరమైన విద్యా ప్రమాణాలపై అధికారుల…
ఉట్పల్లి పాఠశాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ వికాస్ మహతో
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




