భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టిజీ సెట్-2026) హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయని నేటి నుంచి ఈ నెల 22 వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మహబూబాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయ అధికారి, ఇనుగుర్తి గురుకులం ప్రిన్సిపాల్ జయశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను https://share.google/BU4yEpTenYgIcWeOY వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2026-27 అకడమిక్ ఇయర్ కి సంబంధించి 5 నుంచి 9 వరకు…