భారత్ సమాచర్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోసం MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ ను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ పరిశీలించారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ పరిశీలించి.. వార్డుల వారీగా RO, ARO లను నామినేషన్ ల వివరాలు అడిగితెలుసుకున్నారు. వీరివెంట స్థానిక RDO మహిపాల్ , నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి ఉన్నారు. ఎన్నికలకు పగడ్భందీ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.