పార్టీ కేడర్ ఉంది కానీ, కదిలే నాయకులేరీ..?

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ నియోజకవర్గంలో గ్రామీణ స్థాయిలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నప్పటికీ, పట్టణంలో మాత్రం పార్టీ పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించినా, ప్రస్తుతం మున్సిపాలిటీకి వస్తున్న కేంద్ర నిధుల వినియోగంపై అధికారులను ప్రశ్నించే నాథుడే కరువయ్యారు. పట్టణ నాయకత్వంలో సమన్వయ లోపం, అంతర్గత వర్గ విభేదాలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలు ఉన్నా, వారిని నడిపించే దిశానిర్దేశం…