భారత్ సమాచార్, మెదక్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల సర్పంచ్‌ను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోవాలని, వేలంపాట వేయొద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి రూ. 3,500 కోట్లు నిధులు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెడుతుందన్నారు.
అమృత్ పథకం కింద మెదక్ మున్సిపల్‌కు రూ. 30 కోట్లు ఇచ్చామన్నారు. నర్సాపూర్ నుంచి మెదక్…





