భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రా కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిగా అనుసరించి, మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని తెలిపారు. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు…