భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్ జరిగే మండలాల్లో, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఎస్ ఎన్ 163 చట్టం అమల్లో ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం కొల్చారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను గ్రామ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 161 సర్పంచ్ స్థానాలకు, 1220 వార్డు స్థానాలకు మూడో విడత ఎన్నికలకు ఏర్పాటులు పూర్తి చేశామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే…