భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి తెర్నేకల్ వెంకప్ప ఆదివారం దేవనకొండలో ఎంపీడీవో జ్యోతి, సీఐ వేణుగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి, బస్తీ, పంచాయతీ సమస్యలు, విద్యుత్, రోడ్డు, తాగునిటీ సమస్యలు వంటి ప్రజాసంబంధ అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వెంకప్ప మాట్లాడుతూ.. అధికారులు సమస్యలను సమన్వయంతో, త్వరితగతిన పరిష్కరించాలని సూచిస్తూ, ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి




