భారత్ సమాచార్, నేషనల్: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడం పై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్‌గా స్పందించింది. పోలీస్ కస్టడీలో జరుగుతున్న మరణాలు ఆందోళనకరమని, వాటిపై పూర్తి పారదర్శకత ఉండాలంటే సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గత ఎనిమిది నెలల్లో పదకొండు మంది కస్టడీలో ప్రాణాలు కోల్పోయారన్న నివేదిక ఆధారంగా కోర్టు స్వయంగా ఈ విషయంలో విచారణకు దిగింది.

 

ఇప్పటికే 2020లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదేశాలు జారీ చేసి, దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో కెమెరాలు…