భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల స్థితి, సిబ్బంది విధుల నిర్వహణ తీరును సవివరంగా పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స అందుతున్న విధానం, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.అలాగే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీ అనంతరం తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తో పాటు తహసిల్దార్ కార్యాలయ…