భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానిక తిరుమల వైన్స్ ఎదురుగా మెదక్-వెల్దుర్తి ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న పల్సర్ మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన…





