భారత్ సమాచార్.నెట్: భారత అంతరిక్ష పితామహుడు, ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ శత జయంతి నేడు. గగనతలంపై భారత్ విజయాలు సాధిస్తుందంటే అందుకు మూలకారకులలో విక్రమ్ సారాభాయ్ సారాభాయ్ ఒకరు. మరో సైంటిస్ట్ హోమీ బాబా సాయంతో తొలి రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ను కేరళలోని తిరువనంతపురంలో నెలకొల్పారు. విక్రమ్ సారాభాయ్ కృషితోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటై నేడు ప్రపంచ దేశాలకు ఇస్రో సత్తాను చాటుతోంది.

 

ఆగస్టు 12వ తేదీ 1919లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విక్రమ్ సారాభాయ్ పుట్టారు. కేంబ్రిడ్జ్…