భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాల వసతి గృహాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థినుల డార్మెటరీ హాల్, డైనింగ్ హాల్, వంటగది, బాత్రూంలను పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచినప్పటికీ విద్యార్థులకు పెట్టె భోజనంలో నాణ్యత ఉండడం లేదని అన్నారు. అనంతరం మోడల్ పాఠశాలను పరిశీలించారు. తరగతిగదులు, ఆటస్థలం పరిశీలించి మోడల్ పాఠశాల…