భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతు బానోతు యాకూబ్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 117లోని 146 ఎకరాల భూమిని 126 మంది రైతులు గత 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూములకు గతంలో పట్టాలు ఉన్నప్పటికీ ధరణి పోర్టల్‌లో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో…






