భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయంలో మండల స్థాయి 70వ SGF ఖో-ఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీల ఎంపికలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ఎంఈఓ ఆంగోతు రాందాస్ తదితరులు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని ఎంఈఓ…