భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు మండల కేంద్రం ఇనుగుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ ట్రయల్స్‌లో ఇనుగుర్తి పాఠశాల విద్యార్థులు బొల్లు సహస్ర, బొల్లు రష్మి, మందుల నిఖిల్, బోళ్ల భోగేశ్వర్, గట్టిగొర్ల వర్షిత్ అసాధారణ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ఎంపికైన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి…