భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిషేధిత నల్లబెల్లం, పటిక, గుడుంబా అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా భారీగా నల్లబెల్లం, పటిక, గుడుంబా పట్టుబడ్డాయి.
స్థానిక ఎస్‌ఐ గంగారపు కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పోలీసులు మండలంలోని పార్వతమ్మగూడెం స్టేజి సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ట్రాలీ…





