భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సింధుతో పాటు కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి…