భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు మండల స్థాయిలో ఉత్తమ గురువు పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన గురుపూజోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులను ఉత్తమ గురువులుగా ఎంపిక చేశారు. ఒకే విద్యాసంస్థకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పీఎం శ్రీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.…