భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గొర్ల శ్రీశైలం, బాణాల వినోదలకు మంజూరైన చెక్కులను గ్రామ ప్రజాప్రతినిధులు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున మొత్తం రూ.1.20 లక్షల విలువైన చెక్కులను అందించినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో…