భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలనే సందేశాన్ని ఇనుగుర్తి మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థులు తమ సృజనాత్మకతతో చాటిచెప్పారు. వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల యాజమాన్యం సూచన మేరకు బాలబాలికలు మట్టితో గణనాథుల విగ్రహాలను తయారు చేశారు. రసాయనిక పదార్థాలతో తయారయ్యే విగ్రహాల వల్ల పర్యావరణానికి, జలచరాలకు కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

విద్యార్థులు స్వయంగా మట్టితో వివిధ ఆకృతుల్లో గణపతి విగ్రహాలను తయారు చేస్తూ తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల్లో…