భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం సందర్శించారు. విద్యుత్ లోడ్ పరిస్థితులను పర్యవేక్షించడంలో భాగంగా సీఈ గౌతమ్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయానికి, గృహ అవసరాలకు అందుతున్న విద్యుత్ సరఫరా పరిస్థితిపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం, లోడ్ పరిస్థితిపై ఆరా తీశారు.

విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు, పెరుగుతున్న లోడ్ తదితర అంశాలపై అధికారులు…