భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, గణేష్ మండపాల నిర్వాహకులు హాజరయ్యారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్సై వివరించారు.

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై సూచించారు. ఇందుకోసం పోలీస్ శాఖకు చెందిన గణేష్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా నమోదు…