భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురు ఎమ్మార్సీలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సిఆర్పి)గా విధులు నిర్వహిస్తున్న బైరు కవితకు ఇటీవల జరిగిన గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఉత్తమ పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు ఎంఈఓ ఆంగోతు రాందాస్ స్థానిక గవర్నమెంట్ హైస్కూల్లో నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో కవితను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెమెంటో, ప్రశంసాపత్రంతో పాటు ఉత్తమ పురస్కారాన్ని అందజేశారు.
ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన బైరు కవిత 2012 నుంచి విద్యాశాఖలో సిఆర్పిగా…





