భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ భైంసా మండలం వాడి గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ రోడ్డుపైనే మోకాళ్లపై కూర్చుని “మాకు రోడ్డు కావాలి” అంటూ నినాదాలు చేశారు.

గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి…