భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: అక్రమంగా తరలిస్తున్న 324 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని రాజపేట పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అక్రమ రవాణా, నిల్వలు, పీడీఎస్ బియ్యం దుర్వినియోగంపై కొనసాగుతున్న నిఘాలో భాగంగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజపేట పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా రాజపేట మండలం సింగారం గ్రామం వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా…





