భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కర్షకుల కష్టాలు తీర్చేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మడమ తిప్పకుండా నెరవేర్చిన ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్‌కు రుణపడి ఉంటామని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, రామన్నగూడెం గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. నెల్లికుదురు పెద్ద చెరువు జీవనాడిగా ఉన్న కట్టు కాలువ మరమ్మతు పనులను మంజూరు చేయించి, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న కట్టు కాలువ మరమ్మతుల కలను ఎమ్మెల్యే సాకారం…