భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల ప్రాణరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మెదక్ జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ IPS జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు…






