భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రుద్రారంలోని గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఎమ్మెల్యే ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
వినాయక…





