భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ఘనంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర…





