భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాలు, పాఠశాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బండారి పార్థసారథి, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై పి. నరేష్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రైతు వేదికలో ఏఈఓ భాస్కర్, పీహెచ్‌సీలో మండల వైద్యాధికారి…






