భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరుల పాత్ర గొప్పదని, వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునిగంటి రాజన్న పిలుపునిచ్చారు. గురువారం నెల్లికుదురు మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గునిగంటి రాజన్న మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

నిజాం పాలనను ఎదిరించి పోరాడిన దొడ్డి…