భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషణ మాసం కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఆమె అన్నారు.
గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ వర్గాల ఆరోగ్య పరిరక్షణ కోసం…






