భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దివ్యాంగులు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు సహాయ పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగుల కోసం సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. నరేంద్ర మోదీ గత 25…






