భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ప్రభుత్వ పథకాలను ప్రజాక్షేత్రంలో విజయవంతంగా అమలు చేస్తూ సకల వర్గాల సంక్షేమానికి పాటుపడాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిర్మల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను…