భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సృష్టికర్తగా కొలిచే శ్రీ విశ్వకర్మ భగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మానుకోట పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా కొనసాగిన ఈ ర్యాలీలో విశ్వకర్మ జయంతి ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు.
విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుద్ర వెంకటేశ్వర్లు విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం…






