భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ నుంచి సోమనాథ్, ద్వారకా యాత్రకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు నిర్మల్ ఆర్టీసీ డీఎం పండరి తెలిపారు. గురువారం నిర్మల్‌లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు ఒకే యాత్రలో పలు జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా యాత్రా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో అక్టోబర్ 2న మధ్యాహ్నం ఒంటి గంటకు గుజరాత్‌లోని జ్యోతిర్లింగం సోమనాథ్‌కు ప్రత్యేక సూపర్ లగ్జరీ పుష్‌బ్యాక్ బస్సు…





