భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో వేల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెప్పబడుతున్న పురాతన కోనేరు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. సంకినేని బ్రదర్స్ సూచనలతో అండెం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను కాపాడటంతో పాటు, పురాతన కోనేరును భక్తులు, గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. దీంతో ఆలయ పరిసరాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు, చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే అవకాశం…