భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజల భాగస్వామ్యంతో…






