భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వనాథ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ చరిత్ర, ప్రజా ఉద్యమాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వనాథ రాజు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఉద్యమంగా నిలిచిందన్నారు.…