భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని నెల్లికుదురు మండల వైద్యాధికారి డా. రమ్య పిలుపునిచ్చారు. “నశా ముక్త్ యువ – వికసిత్ భారత్” కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డా. రమ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో…