భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆధ్వర్యంలో రామాయంపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు దానిని అమలు చేయకపోవడం పట్ల…






