భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని వావిలాల సెక్టార్ ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల టీచర్ల ఆధ్వర్యంలో కాస్య తండా శివారులోని సంధ్య తండాలో మంగళవారం పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బోడ నర్సింహ నాయక్, తొర్రూరు ప్రాజెక్టు ఏసీడీపీఓ విజయలక్ష్మి, సూపర్‌వైజర్ నీరజ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషకాహారానికి సంబంధించిన చార్టుల ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం ప్రాధాన్యతపై…