భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఘనంగా జయంతి కార్యక్రమం
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన…






